RandomPosts

free counters
Home » » 30న తెలంగాణ బంద్‌: జేఏసీ

30న తెలంగాణ బంద్‌: జేఏసీ

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని వెంటనే స్పష్టం చేయాలంటూ చేసిన తీర్మానాన్ని అఖిల రాజకీయ పక్షాలతో కూడిన సంయుక్త కార్యాచరణ కమిటీ ఆదివారం ఏకగ్రీవంగా ఆమోదించింది. తెలంగాణ సాధన పట్ల తమకుగల నిబద్ధతను ప్రదర్శిస్తున్నట్టుగా తెలంగాణ ప్రాంతానికి చెందిన పౌరులు డిసెంబర్‌ 30వ తేదీన సంపూర్ణ బంద్‌ను పాటించాలని జేఏసీ పిలుపునిచ్చింది. డిసెంబర్‌ 28, 29 తేదీల్లో తెలంగాణ ప్రాంతమంటా గల అన్ని గ్రామాల్లో ర్యాలీలు, ధర్నాలు చేపట్టాల్సిందిగా జిల్లా స్థాయి, గ్రామస్థాయి నేతలకు వారు పిలుపునిచ్చారు.

ఆదివారమిక్కడ జరిగిన జేఏసీ సమావేశంలో ఆమోదించిన తీర్మానాలను జేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ప్రకటించారు. కాంగ్రెస్‌, టిడిపి, టిఆర్‌ఎస్‌, పీఆర్పీ, బిజెపితో పాటుగా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు రాష్ట్ర శాసనసభాపతి, శాసనమండలి ఛైర్మన్‌ను కలుసుకుని తమ రాజీనామాలను వెంటనే

ఆమోదించాలని కోరాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. ఆందోళన కార్యక్రమం చేపట్టిన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులను కలుసుకున్న 900 మంది న్యాయవాదులపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా జేఏసీ కోరింది. సాధ్యమైనంత త్వరలో విధులను బహిష్కరించాల్సిందిగా తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్న న్యాయవాదులందరికీ వారు విజ్ఞప్తి చేశారు.

అంతకుమునుపు టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు నాగం జనార్ధన్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల భావోద్వేగాలు, ఆకాంక్షలు ప్రాతిపదికగా జేఏసీలో చేరాలని తెలంగాణ ప్రాంతానికి చెందిన టిడిపి నేతలు నిర్ణయించినట్టు తెలిపారు. ''తెలంగాణ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసే క్రమంలో ఇతర రాజకీయ పక్షాలు, సంఘాలు, భావసారూప్యత కలిగిన వారితో కలిసి పనిచేస్తాం'' అని ఆయన చెప్పారు.

ఇదిలా ఉండగా జేఏసీ ప్రతినిధుల బృందం సోమవారం ముఖ్యమంత్రి కె.రోశయ్యను కలుసుకుని తమ డిమాండ్ల జాబితాను సమర్పిస్తుందని తెలిసింది.
Share this article :

Recent Posts Slider


Get Your News Widget


 
Support : Your Link | Your Link | Your Link
Copyright © 2013. TELANGANA - All Rights Reserved
Template Created by Creating Website Modified by CaraGampang.Com
Proudly powered by Blogger