5 లక్షల మందితో 3న మహాగర్జన తెలంగాణ విద్యార్థి జేఏసీ ప్రకటన

తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు ఉస్మానియా జేఏసీ మరో ఆలోచన చేసింది. కేంద్రంపై ఒత్తిడి పెంచేందకు జనవరి 3న ఓయూ క్యాంపస్‌ ఆర్ట్స్‌ కళాశాల ఎదుట 'తెలంగాణ విద్యార్థి మహాగర్జన సభ'ను నిర్వహించనున్నట్లు జేఏసీ నాయకులు మర్రి అనిల్‌కుమార్‌, దరువు ఎల్లన్న, పిడమర్తి రవి ఓ ప్రకటనలో తెలిపారు. అమర వీరుల నెత్తుటి సాక్షిగా అయిదు లక్షల మందితో విద్యార్థి మహాగర్జన నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. ఇంటికొక విద్యార్థిని సభకు పంపిచాల్సిందిగా జేఏసీ నాయకులు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. నవంబరు 29 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమంలో మరణించిన అమరవీరుల తల్లిదండ్రులు సభకు ముఖ్యఅతిథులుగా పాల్గొంటారన్నారు.